KDP: జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించి వైఎస్సార్ కడప జిల్లా రాష్ట్రంలో తొలి స్థానం సాధించింది. మార్చి 14న నిర్వహించిన లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 1,03,591 కేసులు పరిష్కరించగా రూ. 24.01 కోట్ల మొత్తాన్ని కక్షిదారులకు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 బెంచీలలో క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించబడ్డాయి.