AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పాశుపతేశ్వర ఆలయాన్ని అధికారులు గుర్తించారు. వారణాసి శైలిలో నాలుగు ద్వారాలతో నిర్మితమైన ఈ ఆలయాన్ని దుర్గగుడి ఈవో వీకే శీనా నాయక్, ఛైర్మన్ రాధాకృష్ణ పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఈ ఆలయాన్ని పునర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.