AP: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు TDP ఎంపీ పుట్టా మహేష్ దొరకడంపై షర్మిల తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినందుకు ఆయనను MPగా అనర్హుడిని చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ వాడకంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే, MPపై చర్యలు తీసుకుని CBN తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆమె పేర్కొన్నారు. యువతకు ఎంపీ ఇచ్చే సందేశం ఇదేనా అని నిలదీశారు.