ADB: గ్రామాన్ని శుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులను ప్రజలు గౌరవించాలని ఎంపీడీవో సూపరింటెండెంట్ గంగాసింగ్ రాథోడ్ అన్నారు. ఆదివారం నార్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి బానోత్ కావేరి, సిబ్బందితో కలిసి పారిశుధ్య కార్మికులను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.