MNCL: బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి పంచాయతీ పరిధిలో ఆదివారం NREGS పథకం కింద రోడ్డు పనులను ప్రారంభించారు. సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నామన్నారు.