NLG: నకిరేకల్ లోని శకుంతల ఫంక్షన్ హాల్లో జరిగిన ఉపాధ్యాయుడు సామంతపురి మురళి ఉద్యోగ విరమణ సన్మానోత్సవంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా మురళి విద్యాశాఖకు అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సమాజానికి మార్గదర్శకంగా పదవీ విరమణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.