చెప్పులు లేకుండా పచ్చటి గడ్డిపై లేదా నేలపై నడవడం వల్ల భూమిలోని సహజ శక్తి శరీరానికి అందుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శరీరంలో మంట తగ్గడంతో పాటు నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. డిప్రెషన్ నుంచి బయటపడటానికి, దీర్ఘకాలిక నొప్పుల ఉపశమనానికి ఈ అలవాటు ఎంతో మేలు చేస్తుంది.