MDK : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలోని శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మాజీ సర్పంచ్ ఖాజీపేట రాజేందర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, జగ్గంపేట సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.