ATP: గుత్తిలోని ఫుట్బాల్ క్రీడా మైదానంలో జరుగుతున్న గుత్తి కోట ఉత్సవాల సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి, రాయలసీమ నాణెముల సేకరణ సంఘం వారి ఆధ్వర్యంలో ఆదివారం పురాతన నాణెముల ప్రదర్శన స్టాళ్లను ప్రారంభించారు. గుత్తి కోటను పరిపాలించిన రాజుల కాలం నాటి నాణేలను ఈ ప్రదర్శనలో ఉంచామన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.