హైదరాబాద్‌లో నిన్న దంచికొట్టిన వర్షానికి పలు చోట్ల పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరింది. మరోవైపు బోరబండలో భారీగా చెరిన వరద నీటిలో…ఓ వ్యక్తితో బైక్‌తో సహా జారీపడి కొంత దూరం వెళ్లాడు. ఆ క్రమంలో గమనించిన ఓ వ్యక్తి అతన్ని కాపాడగా…బైక్ మాత్రం నీటిలో కొట్టుకుపోయింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో…ఆ ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు మోకాళ్ల లోతువరకు చేరడంతో…ప్రయాణికులు రోడ్లపై ప్రయాణించేందుకు నానా తంటాలు పడ్డారు. దీంతోపాటు కృష్ణా నగర్, పంజాగుట్టు, అమీర్ పేట, మైత్రీవనం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. మరోవైపు కూకట్ పల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్లలో కురిసిన వర్షానికి రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈక్రమంలో ఇవి బెంగళూరు, అహ్మదాబాద్‌లో వరదలు కాదని….హైదరాబాద్‌లో మాత్రమేనని నెటిజన్లు సహా పలువురు రాజకీయనేతలు కామెంట్లు చేస్తున్నారు.