హైదరాబాద్లో వర్షం వస్తే చాలు…అనేక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోతున్నాయి. మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోనేతే ఇళ్లలోకి నీరు చేరి అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. దీంతో ఇంట్లో సామాగ్రి తడిసి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వర్షాలకు హైదరాబాద్లో పలు చోట్ల… రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మొకాళ్ల వరకు నీరు చేరి నడిచే ప్రజలు సైతం అవస్థలు పడుతున్నారు. ఇక ఈ వానలతో మోటారు వాహనాలతే కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్లోనే నిలిపిపోతున్నాయి. పలు చోట్ల డ్రైనీజీ హోల్స్, గుంతల కారణంగా వాహనాలు నీట మునిగి ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు. దీనితోపాటు వర్షం పడితే చాలు అనేక చోట్ల కరెంట్ పోవడం సర్వసాధారణంగా మారుతుంది.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా కూడా…హైదరాబాద్ పరిస్థితి మాత్రం మారడం లేదు. అదే పాతకాలపై డ్రైనేజ్ వ్యవస్థతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిన్న పాటి వర్షం వస్తే చాలు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు మొదలవుతున్నాయి. మరోవైపు పలుచోట్ల ఆక్రమించిన చెరువులు, నాలాల ఆక్రమణలే వరద ముంపునకు కారణమని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వం సక్రమంగా నిధులు ఉపయోగించకపోవడం వల్లే హైదరాబాద్ ఇలా తయారువుతుందని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ వరదలపై నెటిజన్లు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.