NGKL: తెలకపల్లి మండలం పర్వతాపూర్‌లో నూతనంగా నిర్మించనున్న చెన్నరాయుడు గుడి నిర్మాణానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చొరవ తీసుకొని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేరా శ్రీను పాల్గొన్నారు.