WGL: వరంగల్లో ప్రతి వాహనదారుడు బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కమిషనర్ తెలిపారు.