WGL: పట్టణంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో శ్రీ భద్రకాళి- భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేటితో 5వ రోజుకు చేరగా అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, వివిధ రకాల పూలతో అలంకరించారు. అమ్మవారు ప్రాత:కాల విశేష దర్శనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.