NLG: శాలిగౌరారం మండలం మాదారంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పరుశురాం ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సేకరణ చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.