MDK: అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇవాళ సూచించారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులతో కలిసి ఆమె ప్రతిజ్ఞ చేయించారు.