కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో బుధవారం రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లతో ఆర్ఎం బీ. రాజు సమీక్ష నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆపరేషన్స్, మెయింటెనెన్స్ విభాగాల్లో డిపోల పనితీరు, ఆర్థిక స్థితిగతులను విశ్లేషించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్టాండ్లలో తాగునీటి వసతి కల్పించాలని, రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని అధికారులకు తెలిపారు.