GDWL: మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని జిల్లా అదనపు ఎస్పీ శంకర్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువత ఆయన స్ఫూర్తితో సమానత్వం, విద్య, న్యాయం వంటి విలువలను అలవర్చుకుని సమాజ అభ్యున్నతికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.