WNP: రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి, ఆత్మీయతకు ప్రతీకలుగా నిలుస్తాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. మదనాపురం మండల సర్పంచ్ శారద రామకృష్ణ మసీద్‌లో ఏర్పాటు చేసిన విందుకు ఆయన హాజరై, ముస్లిం సోదరులకు పండ్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.