KMM: సత్తుపల్లి మండలం చెరుకుపల్లిలోని ఎంపీయూపీఎస్ పాఠశాల ప్రీ-ప్రైమరీ విభాగాన్ని గురువారం AMO ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి విద్యార్థులకు పాఠశాలలో కల్పిస్తున్న వసతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసు నుంచే చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు.