MLG: ములుగు జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా నునేటి శ్యామ్‌కు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర మంత్రి సీతక్కకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం నిస్వార్థంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.