TG: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు పడ్డాయని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తున్నామని తెలిపారు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. రాష్ట్ర ఆర్థిక చక్రం తిరిగేలా చేస్తున్నాయన్నారు.