MDK: రామాయంపేట మండల నూతన వ్యవసాయ అధికారి(AO)గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ బదిలీల్లో భాగంగా ఆయన నిర్మల్ జిల్లా నుంచి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వనని మాట ఇచ్చారు.