NLG: ఉపాధి హామీలో రెండు పూటలా ఫొటో క్యాప్చర్ విధానం తీసి వేయాలని, ఈ నెల 21 నుండి మండలలకేంద్రాల్లో జరుగు ధర్నాలో ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య పిలుపునిచ్చారు. గురువారం కనగల్ మండలం లింగోటంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.