BHPL: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య అన్నారు. నూతనంగా జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఎన్నికైన సమ్మయ్యను పలువురు ప్రజలు కలిసి సన్మానించారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ నిత్యం పేద ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని అన్నారు.