TG: హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు పెరగడంతో ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది 3 నెలల వ్యవధిలో 1,091 ప్రమాదాలు జరగగా, 82 మంది మృతిచెందారు. అధిక శాతం ప్రమాదాలకు అతివేగం, నిద్రమత్తు, రాంగ్ రూట్ ప్రయాణాలే కారణాలుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎరైవ్-ఎలైవ్లో భాగంగా నగరవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.