NZB: బోధన్ లోని అనీసానగర్లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న క్రికెట్ కోచ్ షేక్ ఇలియాస్‌ను సీసీఎస్ & స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. NZBకు చెందిన జునైద్ ప్రోద్బలంతో ఏజెంట్‌గా మారిన ఇలియాస్, యువకులను ఆకర్షించి బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అజర్ అనే వ్యక్తి బ్యాంక్ ఖాతాల ద్వారా సుమారు రూ.45.55లక్షల లావాదేవీలు జరిగినట్లు తెలిపారు.