WGL: విద్యుత్ సంస్థ టీజీ ఎన్పీడీసీఎల్ సమ్మెలో ఉన్న ఆర్టిజన్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. బుధవారం 11 గంటల్లోపు విధుల్లోకి హాజరు కాకపోతే సేవలను రద్దు చేస్తామని యాజమాన్యం హెచ్చరించింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8 నుంచి నిరవధిక సమ్మెలో ఉన్న ఉద్యోగులు ఈహెచ్చరికలతో ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ సమ్మె కొనసాగించాలని ఆర్టిజన్ జేఏసీ నిర్ణయించింది.