WNP: ఆత్మకూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఇవాళ సాయంత్రం నుంచి గురువారం వరకు బీజేపీ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. ఆత్మకూరు, అమరచింత, నర్వ మండలాల నాయకులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.