ప్రభాస్, రాజమౌళిల ‘బాహుబలి’ మ్యాజిక్ మళ్లీ మొదలైంది. ఈ సిరీస్‌కు కొనసాగింపుగా వస్తున్న యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ చిత్రం ఎంపికైంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు గ్లోబల్ గుర్తింపు రావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.