NZB: జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మచ్చర్లలో అత్యధికంగా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, భీమ్గల్, పెర్కిట్, మోర్తాడ్ వంటి ప్రాంతాల్లో 42 డిగ్రీలు దాటింది. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు. మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు