NRML: జిల్లాలో పరీక్షల్లో ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చినా విద్యార్థులు ఆందోళన చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని నర్సాపూర్(జి) ఎస్సై గణేశ్ ఓ ప్రకటనలో సూచించారు. చదువు జీవితంలో భాగమే తప్ప, అదే జీవితం కాదని ఆయన పేర్కొన్నారు. ఓటమి విజయానికి తొలిమెట్టు అని, విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా తల్లిదండ్రులు వారికి అండగా నిలబడాలన్నారు.