WGL: నల్లబెల్లి(M) కొండాపురంకి చెందిన వెన్నెల మానస ఇవాళ పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బందిని కుటుంబసభ్యులు అభినందించారు.