KMM: రేపు జీవి మాల్, గొల్లగూడెంలో నిధి ఆప్కే నికత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమీషనర్ వై.డి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో ఇవాళ తెలిపారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), వరంగల్ ప్రాంతీయ కార్యాలయం తమ పరిధిలోని సంస్థల యాజమాన్యం, ఉద్యోగులు, పింఛనుదారుల కోసం ఈ కార్యక్రమాన్ని ఉ 9.30 నుంచి సా. 4.00 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు.