BDK: గిరిజనుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ITDA PO రాహుల్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో రేపు భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించనున్నారు. గిరిజనులు తయారు చేసిన స్వచ్ఛ ఉత్పత్తులను వినియోగదారులకు అందించి మధ్యవర్తులు లేకుండా న్యాయమైన ధరలు కల్పించడం మార్ట్ ఉద్దేశమన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం గిరిజనుల ఆదాయం పెంపు లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.