ADB: ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి అన్నారు. బేల మండల కేంద్రంలోని సహకార మార్కెట్ ఆధ్వర్యంలో శనగ కొనుగోలును గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.