HYD: శ్రీరామనవమి సందర్భంగా రేపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసు కమిషనర్ డా. రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు & రెస్టారెంట్లలోని బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.