ట్రెంట్ బౌల్ట్ మునుపటిలా వేగంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అతని బౌలింగ్లో పదును తగ్గిందని ABD తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏబీడీ మాట్లాడుతూ.. ‘బౌల్ట్ ఇప్పుడు భారీగా పరుగులు ఇస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు అతడిని సులువుగా టార్గెట్ చేస్తున్నారు. ఈ సీజన్లో MIకి బౌల్టే అతిపెద్ద బలహీనతగా మారబోతున్నాడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.