నల్లగొండ ఆర్టిసీ డిపోకు చెందిన కండక్టర్ కుమార్ తన నిజాయితీని చాటుకున్నాడు. బస్సులో ప్రయాణికురాలు మరచిపోయిన రూ.50 వేల విలువైన ల్యాప్టాప్ బ్యాగును ఆయన ఎంతో బాధ్యతగా భద్రపరిచారు. వెంటనే ఆ ప్రయాణికురాలిని గుర్తించి, సమాచారం అందించి, మిర్యాలగూడలో డీసీ AR రెడ్డి సమక్షంలో ఆమెకు బ్యాగును సురక్షితంగా అందజేశారు.