HYD: రేపు శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయన్నారు. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్‌బజార్ వరకు యాత్ర సాగనుండగా.. మల్లేపల్లి, నాంపల్లి, మంగళ్ హాట్, బేగంబజార్, అఫ్జల్ గంజ్, అబిడ్స్, కోఠి, చాదర్ ఘాట్, కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేయనున్నారు.