MBNR: నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. అలాగే యువత సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.