ధనుష్ హీరోగా, మమిత బైజు హీరోయిన్గా విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కారా’. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమాలో మమితను ఇప్పటివరకు చూడని సరికొత్త లుక్లో చూస్తారని తెలిపాడు. ఆమె పల్లెటూరి అమ్మాయిగా, డీ-గ్లామర్ రోల్లో కనిపించబోతుందన్నాడు. తెరపై ఆమె నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని పేర్కొన్నాడు.