WNP: గ్రామాల్లో సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడమే గ్రామసభల లక్ష్యమని అమలపాకుల సర్పంచ్ గాయత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొత్తకోట మండలం ఆమడబాకుల గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరన్ జిత్ సింగ్ హాజరై ప్రజల సమస్యలు విన్నారు.