SDPT: జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పాఠశాలలు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ డే నడుపుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ డే స్కూల్స్ నడిపిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు.