TG: పెట్టుబడులపై విపక్షాలు చేస్తున్న విష ప్రచారం సరికాదని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఓర్వలేకపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తమపై కోపంతో చేసే ఈ తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదని విమర్శించారు. 2024, 2025 దావోస్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 44 ఎంవోయూలను కుదుర్చుకుందన్నారు.