TG: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషనర్లకు తెలిపింది. వెలుగుమట్లలో అర్హులకు పట్టాలు ఇస్తున్నందుకు స్టే ఇవ్వలేమని.. హైకోర్టు పేర్కొంది. కాగా, వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. సీసీఎల్ఏ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.
Tags :