KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం తిరుమలాయపాలెం మండలంలోని ఇస్లావత్ తండాలో పర్యటించి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని, ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.