ATP: జిల్లాలో నిషేధిత జాబితాలో ఉన్న 22ఏ, డాటెడ్ ల్యాండ్స్ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, DRO మాలోలతో కలిసి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వందలాది క్లెయిమ్స్ పరిశీలించి, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.