కోనసీమ: జిల్లాలో గ్యాస్ సరఫరాపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్వో ఉదయ భాస్కర్ హెచ్చరించారు. గురువారం గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించవద్దని తెలిపారు. వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏజెన్సీల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు.