TG: ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ, ఖమ్మం జిల్లాలో స్పాంజి ఐరన్ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం చాలా సార్లు కేంద్ర మంత్రిని కలిశామని గుర్తు చేశారు. ఖమ్మంలో స్పాంజ్, ఐరన్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్, భట్టి విక్రమార్కలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.